"ఏవాఁయ్ సుబ్బారావ్! ఏదో లోన్ తీసుకుని ఎగ్గొట్టావనీ.. బేంక్ నోటీసొచ్చిందనీ.. "
"డోంటాక్ రబ్బిష్, భారత ఆర్ధిక వ్యవస్థని ప్రశ్నిస్తావా? బేంకుల morale దెబ్బతింటుంది."
"మొన్నామధ్య నువ్వు దొంగరైలెక్కావనీ.. పట్టుకున్న టీసీ కాళ్ళావేళ్ళాపడ్డావనీ.. "
"డోంటాక్ రబ్బిష్, Indian railways ని ప్రశ్నిస్తావా? రైల్వే ఉద్యోగుల morale దెబ్బతింటుంది."
"ఉప్మాలో ఉప్పు తక్కువైందని నీ భార్యని బాదిపడేశావనీ.. ఆమె పుట్టింటికి వెళ్ళిపోయిందనీ.. "
"డోంటాక్ రబ్బిష్, వివాహ వ్యవస్థని ప్రశ్నిస్తావా? నా భార్య morale దెబ్బతింటుంది."
"పక్కింటామెకి కన్ను కొట్టావనీ.. ఆమె నీ గూబ గుయ్యిమనిపించిందనీ.. "
"డోంటాక్ రబ్బిష్, ఇరుగుపొరుగుల సంబంధాన్ని ప్రశ్నిస్తావా? మా పక్కింటావిడ morale దెబ్బతింటుంది."
"ఇదేవిఁటాయ్! యేవఁడిగినా morale అంటావ్!"
"డోంటాక్ రబ్బిష్, నాకు ప్రాణం కన్నా morale ముఖ్యం."